తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటాయింపులు తగ్గాయి.. న్యాయం మీరే చేయాలి..

2011జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించే విధానం వల్ల తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్​సభలో అన్నారు.  ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

trs mp nama nageshwara rao participated in budget discussion
నామ నాగేశ్వర రావు

By

Published : Feb 10, 2020, 9:42 PM IST

లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 2011జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించే విధానం వల్ల తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మోదీ సర్కార్ వాస్తవానికి దూరంగా బడ్జెట్ అంచనాలు రూపొందించిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం... ఆ దిశగా బడ్జెట్​లో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని పేర్కొన్నారు. విభజన చట్టం మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని... సత్వరమే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

నామ నాగేశ్వర రావు

ఇదీ చూడండి: రిజర్వేషన్లు రద్దు చేయడమే వారి లక్ష్యం: రాహుల్

ABOUT THE AUTHOR

...view details