తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కొవిడ్ పాజిటివ్ నిర్దరణ అయినందున.. గత కొన్ని రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ చేశారు. ఇటీవల ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కొవిడ్ పాజిటివ్ - covid positive
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కొవిడ్ నిర్ధరణ