గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని తెరాస పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, తెరాస నేత భరత్‌కుమార్ ఎన్నికల సంఘానికి లేఖను అందజేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి: తెరాస - తెరాస ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని తెరాస ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నేత భరత్‌కుమార్‌తో కలిసి ఎన్నికల సంఘానికి లేఖను అందజేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి: తెరాస
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ ఏ పద్ధతిలో ఉండాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభిప్రాయం కోరిన మేరకు.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం బ్యాలెట్ పద్ధతి నిర్వహణకే మొగ్గు చూపినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎం కంటే బ్యాలెట్ పద్ధతి ఉత్తమమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.