తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యా, రాజకీయ రంగాలు కొత్తేమీ కాదు: వాణీదేవి - mlc elections news

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ప్రచార సభలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. తనకు విద్య, రాజకీయ రంగాలు కొత్తేవి కావన్నారు.

విద్యా, రాజకీయ రంగాలు కొత్తేమీ కాదు: వాణీదేవి
విద్యా, రాజకీయ రంగాలు కొత్తేమీ కాదు: వాణీదేవి

By

Published : Mar 1, 2021, 3:05 PM IST

విద్యా, రాజకీయ రంగాలకు తనకు కొత్తేమీ కాదని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.

పీవీ వారసురాలిగా చిన్నతనం నుంచి అవగాహన ఉందన్నారు. విద్యాసంస్థల ద్వారా ఎంతో మందిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. మెుదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించేలా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సురభివాణీదేవి సూచించారు.

విద్యా, రాజకీయ రంగాలు కొత్తేమీ కాదు: వాణీదేవి

ఇదీ చదవండి:'మన ఓటే.. మన భవిష్యత్​ను మార్చే ఆయుధం'

ABOUT THE AUTHOR

...view details