కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం కన్నా ఎక్కువ సమయమే కేటాయించారని తెరాస ఎమ్మెల్యేలు తెలిపారు. మాట్లాడే అవకాశం కల్పించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, సైది రెడ్డి, మెతుకు ఆనంద్ ఖండించారు.
'అసెంబ్లీలో కాంగ్రెస్ గొంతు నొక్కుతున్నారనడం హాస్యాస్పదం'
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను తెరాస ఎమ్మెల్యేలు ఖండించారు. పార్టీల మెజార్టీని బట్టి స్పీకర్ సమయం కేటాయిస్తారని... ఆ విషయం కాంగ్రెస్ నేతలకు తెలుసని వ్యాఖ్యానించారు.
తెరాస పార్టీ అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతొందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీల మెజార్టీని బట్టి స్పీకర్ సమయం కేటాయిస్తారని... ఆ విషయం కాంగ్రెస్ నేతలకు తెలుసని వ్యాఖ్యానించారు. స్పీకర్ను అవమాన పరిచే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీఎం గురించి పరుష పదజాలంతో మాట్లాడితే.. సహించేది లేదన్నారు.
ఇదీ చూడండి:'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్లో పెట్టుకుంటే బాగుంటుంది'