ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెరాస నేతలు ఎద్దేవా చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత హస్తం పార్టీదేనని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లోని సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో భట్టి విక్రమార్క ప్రవచనాలు వల్లిస్తున్నారని విమర్శించారు. తెరాసలోకి వచ్చిన 12 మంది శాసన సభ్యులు రాజ్యాంగబద్దంగానే ఆ పార్టీని వీడారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య రక్షణ పేరిట డ్రామాలు ఆపితే మంచిదన్నారు.
'ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం' - బాల్క సుమన్
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత హస్తం పార్టీదేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట డ్రామాలు ఆపాలని సూచించారు.

బాల్క సుమన్
కాంగ్రెస్ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న బాల్క సుమన్
ఇదీ చూడండి :'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకులు'