TRS MLA's on Revanth reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస నేతలు మండిపడ్డారు. పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో నీళ్లు, నిధులు, నియమాకాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్... రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్‌ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని... ఖర్చులుంటే తాము భరిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
'మిషన్ భగీరథ అంటే రేవంత్ రెడ్డి... వేల కోట్ల అవినీతి అంటారు. మిషన్ కాకతీయ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే వేలకోట్ల అవినీతి అంటారు. కరోనా వ్యాక్సిన్ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. ఇంటర్ బోర్డు-పేపర్లు-ఎగ్జామ్ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. కోకాపేట భూములు అంటే వేలకోట్ల అవినీతి అంటారు. ఈ వేలకోట్లు, అవినీతి అనేవి రేవంత్‌కు ఊతపదాలుగా మారాయి. ఆయన మాట్లాడితే ఇవే వస్తాయి తప్పా... ఎన్నడూకూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాటలు రావు.'
-బాల్క సుమన్, ప్రభుత్వ విప్
రేవంత్‌పై ఆరోపణలు
రేవంత్ రెడ్డికి విషం తప్పా.. విషయ పరిజ్ఞానంలేదని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. భాజపాకు రేవంత్ రెడ్డి కోవర్టు అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయనకు ఉరితాడు బిగించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు.
'మన ఊరు-మన పోరు అంటా. ఇదికాదు... మన పార్టీ-మన పోరు పెట్టుకుంటే ఫుల్‌గా విజయవంతం అవుతుంది. భీమ్లా నాయక్ లెక్క సూపర్ హిట్ అవుతుంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ వంటి వాళ్లతో కలిసి మన పార్టీ-మన పోరు కార్యక్రమాలు పెట్టుకోండి.'