కాంగ్రెస్ నాయకులు పెట్టిన సభ రైతుల కోసం కాదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అది కాంగ్రెస్ కోట్లాట సభ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాహుల్‌గాంధీని తెలంగాణలో రాచరికపు గాంధీగా వచ్చారని విమర్శించారు. నిన్న సభలో అన్ని తప్పులు మాట్లాడారని... సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో వాటిని పేరు మార్చి చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
"కాంగ్రెస్ నాయకులు వరంగల్ పెట్టిన సభ రైతుల కోసం కాదు. అది కాంగ్రెస్ కోట్లాట సభ. రాహుల్‌గాంధీ తెలంగాణలో రాచరికపు గాంధీగా వచ్చారు. ఆయన రాహుల్ గాంధీ కాదు ..రాహుకల్ గాంధీ. వరంగల్ డిక్లరేషన్ సభ కాదు. కాంగ్రెస్ ప్రస్టేషన్ సభ. అన్ని తప్పులు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో వాటిని పేరు మార్చి చెబుతున్నారు." - జీవన్ రెడ్డి తెరాస ఎమ్మెల్యే