తెరాసను బలహీనపరిచేందుకు భాజపా పెద్దల కుట్ర: బాల్క సుమన్ Balka Suman fires on Bjp: భాజపా కుట్రలను తెరాస ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ సమాజం అమ్ముడుపోయేది కాదని భాజపా గ్రహించాలని వ్యాఖ్యానించారు. మునుగోడులో ఓడిపోతామనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని బాల్క సుమన్ మండిపడ్డారు. భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఎరగా చూపి తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
'ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఆఫర్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని భాజపా నేతలు ప్రయత్నించడంతో మా ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ సమాజం అమ్ముడు పోయేది కాదని భాజపా గ్రహించాలి. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలో భాజపా అనేక కుట్రలు చేసింది. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బిడ్డలు నడుస్తారు. మునుగోడులో ఓడిపోతామనే భాజపా నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా అనేక దుర్మార్గాలకు పాల్పడుతోంది'-బాల్క సుమన్, తెరాస ఎమ్మెల్యే
ఉద్యమకారులను ఎప్పటికీ కొనుగోలు చేయలేరని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డిలా తెరాస ఎమ్మెల్యేలు ఎప్పుడూ చేయరని తెలిపారు. తెరాసను బలహీనపరిచేందుకు భాజపా పెద్దల కుట్ర అని ధ్వజమెత్తారు. భాజపా కుట్రలను మునుగోడు ప్రజలు గ్రహించాలని సూచించారు. ప్రలోభాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు. భాజపాను తెలంగాణ నుంచి కూకటివేళ్లతో పెకిలించాలని పేర్కొన్నారు. కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని.. మోదీని గద్దె దింపుతారని దిల్లీ పెద్దలకు భయం పట్టుకుందని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.
భాజపా కుట్రలను తెరాస ఎమ్మెల్యేలు భగ్నం చేశారని ప్రభుత్వ విఫ్ వినయ్ భాస్కర్ అన్నారు. భాజపా కుట్రలు తెలంగాణలో సాగవని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చటం మానుకోవాలని భాజపాకు వినయ్ భాస్కర్ హితవు పలికారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మండమైన తీర్పు ఇవ్వనున్నారని ప్రభుత్వ విఫ్ తెలిపారు.
ఇవీ చదవండి: