trs ministers meet Piyush Goyal : పీయూష్ గోయల్‌తో తెరాస మంత్రులు, ఎంపీలు భేటీ - తెరాస మంత్రుల దిల్లీ పర్యటన

15:48 December 21
పీయూష్ గోయల్‌తో తెరాస మంత్రులు, ఎంపీలు భేటీ
trs ministers meet Piyush Goyal : ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం.... కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ అయింది. మంత్రి నిరంజన్ రెడ్డి సహా పలువురు ఎంపీలు గోయల్‌తో సమావేశమయ్యారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోరనున్నారు. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు కోరినా సరైన స్పందన లేకపోవటంతో... చివరి ప్రయత్నంగా మరోసారి దిల్లీ వెళ్లారు. పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మూడ్రోజులుగా నిరీక్షించగా...ఇవాళ లభించింది.
ఇదీ చూడండి:Piyush Goyal on Cm kcr: 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు'