తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ నెంబర్​1, కేటీఆర్​కు 11వ స్థానం

తెరాస సభ్యత్వ నమోదులో ముఖ్యమంత్రి కేసీఆర్​ నియోజకవర్గమే మెుదటిస్థానంలో నిలిచింది. మంత్రుల్లో మల్లారెడ్డి, జగదీష్​ రెడ్డి నియోజకవర్గాలు మాత్రమే టాప్​టెన్​లో నిలిచాయి. కేటీఆర్​ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల పదకొండో స్థానంలో ఉండగా... హరీశ్​రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట పదో స్థానంలో నిలిచింది.

By

Published : Aug 22, 2019, 7:48 PM IST

తెరాస సభ్యత్వ నమోదులో గజ్వేల్​దే మెుదటిస్థానం

తెరాస సభ్యత్వ నమోదులో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గమే అగ్రభాగాన నిలిచింది. గజ్వేల్ నియోజకవర్గంలో 90 వేల 575 మంది సభ్యత్వం తీసుకున్నట్లు తెరాస ప్రకటించింది. మంత్రుల్లో మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి నియోజకవర్గాలే టాప్ టెన్​లో నిలిచాయి. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల 63 వేల 450 సభ్యత్వాలతో పదకొండో స్థానంలో ఉండగా.. హరీశ్​ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట 64 వేల 575 మందితో 10వ స్థానంలో నిలించింది. రాష్ట్రంలో రెండో స్థానంలో మేడ్చల్ ఉండగా.. మూడో స్థానంలో పాలకుర్తి, నాలుగో స్థానంలో ములుగు నిలిచాయి. ఐదో స్థానంలో మహబూబాబాద్, ఆరోస్థానంలో సత్తుపల్లి, ఏడో స్థానంలో పాలేరు, ఎనిమిదో స్థానంలో సూర్యాపేట, తొమ్మిదో స్థానంలో వర్ధన్నపేట, పదో స్థానంలో సిద్దిపేట ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరసగా సిరిసిల్ల, నారాయణపేట, నకిరేకల్, పటాన్​చెరు నిలిచాయి. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలపై కేటీఆర్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సభ్యత్వాలు నమోదు కాలేదు.

తెరాస సభ్యత్వ నమోదులో గజ్వేల్​దే మెుదటిస్థానం

ABOUT THE AUTHOR

...view details