తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr: సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ - trs meeting

Cm Kcr: సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ
Cm Kcr: సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ

By

Published : Oct 17, 2021, 2:46 PM IST

Updated : Oct 17, 2021, 4:22 PM IST

14:01 October 17

సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ

   తెలంగాణ భవన్​లో రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్​ అధ్యక్షతన  తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై ఈ భేటీలో చర్చించనున్నారు. నవంబరు 15న వరంగల్ విజయగర్జన సభ నిర్వహణపై చర్చ చేపట్టనున్నారు. పార్టీ పురోగతిపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, నగర కమిటీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  20 ఏళ్ల పార్టీ ఉద్యమం, పాలన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై భవిష్యత్తు రోడ్‌మ్యాప్​ను కేసీఆర్​ వివరించే అవకాశం ఉంది.

కేసీఆర్​ తరఫున 6సెట్ల నామినేషన్​

   మరోవైపు తెరాస అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ(TRS President Election 2021) లాంఛనంగా ప్రారంభమైంది. తెరాస అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మంత్రులు 6 సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్ తరఫున పలువురు మంత్రులతో పాటు ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డికి నామినేషన్ సమర్పించారు. ఈనెల 22 వరకు నామినేషన్లను స్వీకరించి.. 23న పరిశీలన చేపట్టనున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. అనంతరం ఈనెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే పార్టీ ప్రతినిధుల సభలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్లీనరీలో సుమారు 14వేల మంది పార్టీ ప్రతినిధులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు పార్టీ తరఫున ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినందున.. కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే(TRS President Election 2021) అవకాశం ఉంది. కేసీఆర్​ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదించగా.. మిగిలిన వారు బలపరిచారు.

15న తెలంగాణ విజయగర్జన సభ

     పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి(TRS President Election 2021) ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రెండు దశాబ్దాల్లో తెరాస, ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్​లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నారు. తెరాస స్థాపించి 20 ఏళ్లు అవుతున్నందున వరంగల్‌లో ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం స్థల సేకరణ చేయాలని.. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ సహా పలువురు మంత్రులను కేసీఆర్‌ ఆదేశించారు.

ఇదీ చదవండి: TRS President Election 2021: తెరాస అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ షురూ.. నామినేషన్​ దాఖలు!

Last Updated : Oct 17, 2021, 4:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details