తెరాస పాలనకు వ్యతిరేకంగా మార్చి 7న తెలంగాణ ఉద్యమకారుల సింహ గర్జన మహాసభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చాకే ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. హైదర్‌గూడలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
'తెరాస నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి' - ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పోటీ చేయడంపై ఐక్యవేదిక ఆగ్రహం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థులు తక్షణమే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
!['తెరాస నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి' TRS leaders should withdraw nominations demand by Raghuma Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10797408-1086-10797408-1614407425154.jpg)
'తెరాస నాయకులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి'
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికార తెరాస అభ్యర్థులు తక్షణమే వారి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రచారం నిర్వహిస్తే వారిని అడ్డుకుంటామని.. అనంతరం జరిగే పరిణామాలకు సీఎం పూర్తి బాధ్యత వహించాలని రఘుమారెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సాక్షిగా మహాసభను నిర్వహిస్తామన్నారు. మరోసారి నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేస్తున్న తెరాసకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు ఐక్యవేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు .