రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ తెరాస నేతలు.. రేవంత్‌రెడ్డి, మల్రెడ్డి సోదరుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం బీఎన్‌రెడ్డి కూడలి వద్ద దహనం చేశారు.
రేవంత్‌రెడ్డిపై తెరాస నేతల ఆగ్రహం.. అడ్డుకుంటామని హెచ్చరిక - hyderabad news
టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డిపై.. ఎల్బీనగర్కు చెందిన తెరాస నేతలు మండిపడ్డారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతని దిష్టిబొమ్మను దహనం చేశారు.
![రేవంత్‌రెడ్డిపై తెరాస నేతల ఆగ్రహం.. అడ్డుకుంటామని హెచ్చరిక trs fires on revanth reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12367180-185-12367180-1625532127566.jpg)
2017లో రేవంత్‌రెడ్డి.. తెదేపా నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు స్పీకర్‌కు రాజీనామా ఇవ్వలేదని.. అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారని.. తెరాస నేతలు ఆరోపించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి.. ఎల్బీనగర్కు కేవలం రెండే సార్లు వచ్చారన్నారు. తమ నేతలపై ఇష్టానుసారం మాట్లాడితే ఎల్బీనగర్లో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు.
ఇదీచూడండి:Sharmila: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల పార్టీ జెండా!