వలస కార్మికులకు రాగి జావ పంపిణీ - LOCK DOWN UPDATES
హైదరాబాద్ విక్టోరియా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన శిబిరంలోని వలస కార్మికులకు తెరాస నేతలు రాగి జావ అందించారు. నిబంధనలు పాటించి కరోనాను తరిమికొట్టేందుకు సహకరించాలని కార్మికులను కోరారు.
![వలస కార్మికులకు రాగి జావ పంపిణీ trs leaders distributing ragi java to migrant workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6844597-875-6844597-1587209498498.jpg)
వలస కార్మికులకు రాగి జావ పంపిణీ
తెరాస కార్మిక విభాగం మలక్పేట్ ఇంఛార్జ్ కరీంగల మారుతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులకు రాగి జావ పంపిణీ చేశారు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విక్టోరియా గ్రౌండ్ శిబిరంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడుకు చెందిన 150 మందికి రాగి జావ అందించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ... కరోనాను తరిమికొట్టాలని కార్మికులకు నేతలు సూచించారు.