తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ ఆపత్కాలంలో.. వారికి కాస్త చేయూతనివ్వండి' - grocery distribution in hyderabad

కరోనా దెబ్బతో రోజువారీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు నల్లకుంట డివిజన్ తెరాస సీనియర్​ నేత శ్రీనివాస్​గౌడ్ ముందుకొచ్చారు. గాంధీనగర్​లోని 85 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

trs leaders distributed groceries at nallakunta
ఈ ఆపత్కాలంలో.. వారికి కాస్త చేయూతనివ్వండి

By

Published : Apr 14, 2020, 7:05 PM IST

కరోనా వైరస్​ ప్రభావం రోజూవారి కూలీలపై తీవ్రంగా పడుతోంది. ఏరోజుకారోజు పనిచేసుకుంటూ బతుకీడుస్తున్న వారు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు హైదరాబాద్​ నల్లకుంట డివిజన్​కు చెందిన తెరాస సీనియర్​ నేత శ్రీనివాస్​ గౌడ్ ముందుకొచ్చారు.

బస్తీలోని 85 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆపత్కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సామాజిక స్పృహ చాటుకొని, సేవా దృక్పథం ఉన్న వారిగా నిరూపించుకోవాలని కోరారు.

కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున ప్రతిఒక్కరు ఇంట్లోనే ఉండి, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించి, వైరస్​ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details