తెలంగాణ

telangana

ETV Bharat / state

'మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర'

ప్రతిపక్షాలపై తెరాస నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకే కుట్రపన్నతున్నారని ఆరోపించారు.

Trs leaders  criticized Opposition leaders at hyderabad
'మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర'

By

Published : Jul 11, 2020, 3:10 PM IST

Updated : Jul 11, 2020, 3:36 PM IST

'మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర'

కాంగ్రెస్​, భాజపా రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని తెరాస నేతలు మండిపడ్డారు. హైదరాబాద్​లో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్రపన్నుతున్నాయని మాజీ మంత్రి దానం నాగేందర్​, ప్రభుత్వ విప్​ ఎంఎస్​ ప్రభాకర్​, హైదరాబాద్​ మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్సీ శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. సచివాలయం కూల్చివేత పర్యావరణ నిబంధనల ప్రకారం... కోర్టు తీర్పునకు అనుగుణంగానే జరుగుతుందని తెరాస నేతలు పేర్కొన్నారు.

సచివాలయంలో ప్రార్థన మందిరాల తొలగింపునపై సీఎం ఇప్పటికే వివరణ ఇచ్చారని తెలిపారు. మత పెద్దలతోనూ... మాట్లాడారని.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు కూడా తీసుకుంటామని సీఎం హామీకూడా ఇచ్చారని చెప్పారు.

సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని.. కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయని తెరాస నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను ఇప్పటికే ప్రజలు ఛీకొట్టారని... ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే.. బంగాళాఖాతంలో కలుపుతారన్నారు.

ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

Last Updated : Jul 11, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details