trs leaders complaint against mp arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తెరాస పార్టీ సోషల్‌మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు చేసినందుకు ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్‌ను అవమానిస్తే యావత్ తెలంగాణ ప్రజలందరిని అవమానించినట్లేనని సతీశ్ రెడ్డి అన్నారు. 24గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఎంపీ అర్వింద్ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.