హైదరాబాద్ రామ్‌నగర్‌లో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచారు.
రామ్‌నగర్‌లో తెరాస శ్రేణుల సంబురాలు - హైదరాబాద్ వార్తలు
రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ చట్టంలో తీసుకొవచ్చిన మార్పులు చారిత్రాత్మకమైందని రామ్‌నగర్‌లో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచారు.
రామ్‌నగర్‌లో తెరాస శ్రేణుల సంబురాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన మార్పులు భావితరాలకు ఎంతగానో దోహదపడతాయని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్, ఇతర రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాయని చెప్పారు.
ఇదీ చూడండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్