సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తెరాస ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దాదాపు 100 మంది తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు. తలసేమియా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రక్తదానం వల్ల మానసికంగా, శారీరకంగా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. రక్తదానం చేసిన తెరాస కార్యకర్తలను ఆయన అభినందించారు. మరింత మంది తెరాస కార్యకర్తలు, నాయకులు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కోరారు. రక్తదానం చేయడం మూలంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందనే అపోహలు నమ్మవద్దని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా. రితీశ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే తమను సంప్రదించాలని ఆయన తెలిపారు.
తెరాస నాయకుల రక్తదాన శిబిరం
తలసేమియా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తెరాస ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెరాస సీనియర్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌తో పాటు 100 మంది కార్యకర్తలు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
తెరాస నాయకుల రక్తదానం