హైదరాబాద్ సీతాఫల్‌మండీ ప్రాంతానికి చెందిన ఓ రోగికి శనివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తగా తెరాస నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ వెంటనే స్పందించారు. వైద్యుల సూచన మేరకు ఆక్సిజన్ సిలిండర్‌ను అందించేందుకు ఏర్పాట్లు జరిపారు.
రోగికి ఆక్సిజన్ సిలిండర్ అందించిన తెరాస నేత రామేశ్వర్ గౌడ్ - oxygen cylinder to the patient
శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న రోగికి ఉపసభాపతి తనయుడు, తెరాస నేత రామేశ్వర్ గౌడ్ సాయం చేశారు. వైద్యుల సూచన మేరకు ఆక్సిజన్ సిలిండర్ అందించేందుకు సాయం చేశారు.
రోగికి ఆక్సిజన్ సిలిండర్ అందించి తెరాస నేత రామేశ్వర్ గౌడ్ సాయం
తెరాస మహిళా స్థానిక నాయకురాలు శ్రీమతి సరోజిని ద్వారా రోగికి ఆక్సిజన్ సిలిండర్‌ను హుటాహుటిన పంపారు. దాంతో రోగి బంధువులు తీగుల్ల రామేశ్వర్ గౌడ్‌కు, ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం: తలసాని