తెరాస నాయకుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పుర ఎన్నికలపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన కాంగ్రెస్... తన డొల్ల తనాన్ని బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు.
'తెరాస పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోంది' - కాంగ్రెస్ పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజం
పురపాలిక ఎన్నికలపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన కాంగ్రెస్ తన డొల్లతనాన్ని బయటపెట్టుకుందని తెరాస నేత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
విజన్ డాక్యుమెంట్‌లో 5 రూపాయల భోజనం పెడతామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన 5 రూపాయల భోజనం ఎలా ఉందో జానారెడ్డిని అడిగి తెలుసుకోండని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతి పథకాన్ని కాంగ్రెస్.. తమ డాక్యుమెంట్‌లో పెట్టిదని విమర్శించారు.
వచ్చే ప్రభుత్వం తమదే అన్నట్లుగా భాజపా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని...సింహభాగం తెరాస గెలుస్తోందని పల్లా ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేటీఆర్ చెప్పిందే జరుగుతుందన్నారు.
- ఇదీ చూడండి : 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'