తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 6:13 PM IST

ETV Bharat / state

'కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి'

కంటోన్మెంట్లోని ఏడో వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెరాస నాయకుడు రవీంద్ర గుప్తా కంటోన్మెంట్‌ సీఈవోను కోరారు. నూతనంగా కంటోన్మెంట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

'కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి'
'కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి'

కంటోన్మెంట్ అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షణీయమని కంటోన్మెంట్ తెరాస నాయకుడు రవీంద్ర గుప్తా అన్నారు. కంటోన్మెంట్లోని ఏడో వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెరాస సీనియర్ నాయకుడు రవీంద్ర గుప్తా కంటోన్మెంట్ సీఈవోను కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

డంపింగ్ యార్డ్ లేదని.. దీంతో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరారు.

కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగంగా ఏడో వార్డు లోని రోడ్లు, మంచినీరు విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సీఈవో అజిత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు రవీంద్ర గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details