కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ అన్నారు. గోశామహల్ డివిజన్లోని ఆర్యసామాజ్ భవనంలో జోషివాడి, నాయబస్తీ, లక్ష్మినారాయణ బస్తి, గోశామహల్ బస్తీలకు చెందిన 200 వందల మంది పేదలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, ఎన్ 95 మాస్క్‌లను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, శైలేష్ కుర్మలతో కలసి అందజేశారు.
'కరోనా నిర్మూలనకు సీఎం కేసీఆర్ సైనికుడిలా కృషి చేస్తున్నారు' - hydearabad latest news
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల కడుపు నింపడానికి ఆదిత్య కృష్ణా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ ముందుకొచ్చారు. గోశామహల్ డివిజన్ పరిధిలోని సుమారు 200 మంది పేదలకు నిత్యవసర వస్తువులు, మాస్క్‌లను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు 20 రోజులుగా నిత్యావసర సరుకులు, మాస్కులు ఇవ్వడం గొప్ప విషయమని శైలేశ్ కుర్మ అన్నారు. స్థానికంగా ఉన్న భాజపా కార్పొరేటర్లు ప్రజల బాధలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తమకు ఎలాంటి ఆపద వచ్చిన నందు బిలాల్ అండగా ఉంటారన్న విశ్వాసం ప్రజల్లో క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు.