తెలంగాణ భవన్ వద్ద శనివారం నిర్వహించిన సంబురాల్లో తెరాస నాయకుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ తుపాకీతో రావడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. విజయోత్సాహంలో మునిగిపోయారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తీసి హల్చల్ చేశారు.
తెలంగాణ భవన్ వద్ద గన్‌తో తెరాస నాయకుడి హల్చల్ - హైదరాబాద్ తాజా వార్తలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించంటంతో ఆ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ వద్ద సంబురాలు జరుపుకున్నారు. తెరాస నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తీయడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ భవన్ వద్ద గన్‌తో తెరాస నాయకుడు
జేబులోంచి తుపాకీ తీసి గాలిలోకి కాల్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పక్కనున్న వారు వద్దని వారించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఈసీ అనుమతి