ఆర్టీసీ కార్మికుల ఆవేదన తెరాస నేతలకు వినపడడంలేదని... కేశవరావు మాత్రమే మనసుతో స్పందించారని కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కేకే నిన్న చేసిన ప్రకటనతో కార్మికుల్లో ఆశపుట్టిందన్నారు. కేకేను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతానని కేకే చెప్పినట్లు కొండా పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెతో అందరూ నష్టపోతున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెరాసకూ నష్టమేనన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖను పక్కన పెట్టుకుని పాలన చేస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ సమ్మెపై కేకే మనసుతో స్పందించారు : కొండా - FORMER MP KONDA VISHWESHWAR REDDY
కె.కేశవరావును కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. కేకే విడుదల చేసిన ప్రకటనతో ఆశ పుట్టిందని అన్నారు.
కేకే ప్రకటన ఆర్టీసీ కార్మికుల భవితవ్యంపై ఆశలు పుట్టించాయి : కొండా
ఇవీ చూడండి : హుజూర్‌నగర్‌లో తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
Last Updated : Oct 15, 2019, 9:15 PM IST