రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య మరింతగా పెరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్, దుండిగల్, జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, బోడుప్పల్, ఘట్కేసర్, పోచారం తదితర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు నామినేషన్ టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డితో సమావేశమయ్యారు.
సికింద్రాబాద్ బోయిన్పల్లి వద్ద మల్లారెడ్డి గార్డెన్లో ఆశావహుల అంతా తమ అభ్యర్థనను మంత్రికి విన్నవించారు. గుండ్లపోచంపల్లి నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు.