ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేవలం తెరాస మాత్రమే వాణీదేవిని పోటీచేయిస్తూ.. నిబద్ధతను చాటుకుందని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు న్యాయవాదుల పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
'తెరాస మాత్రమే మహిళల పట్ల నిబద్ధత చాటుకుంది' - telangana news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్. ఆమెకు న్యాయవాదుల పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
'తెరాస మాత్రమే మహిళల పట్ల నిబద్ధత చాటుకుంది'
దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని... న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.