తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాకు తెరాస మద్దతు పలుకుతోంది: కోదండ రెడ్డి - కిసాన్ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

తెరాస, భాజపాలు రెండు ఒక్కటేనని కిసాన్ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. గ్రేటర్​ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. పార్లమెంటులో ప్రతి బిల్లుకు తెరాస మద్దతు తెలిపిందని ఆయన మండిపడ్డారు.

TRS is supporting the BJP in greater elections says kisan congress vice president kodanda reddy
భాజపాకు తెరాస మద్దతు పలుకుతోంది: కోదండ రెడ్డి

By

Published : Nov 28, 2020, 5:15 PM IST

భాజపాతో తెరాసకు లోపాయికారి ఒప్పందం కుదిరిందని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు తెరాస మద్దతు తెలిపిందని విమర్శించారు. మాజీ దివంగత ప్రధాని రాజీవ్​గాంధీ సంస్కరణలతోనే స్థానిక సంస్థలకు పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

భాజపా, తెరాసలు కలిసి ప్రభుత్వరంగ వ్యవస్థలను కుప్పకూల్చారని మండిపడ్డారు. గ్రేటర్​లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను మంత్రి కేటీఆర్ మద్దతు కోరడంపై కోదండరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'మత ఘర్షణలు ఎక్కడ జరుగుతున్నాయో కేసీఆర్‌, కేటీఆర్‌ చెప్పాలి' ​

ABOUT THE AUTHOR

...view details