రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిరోధించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెరాస ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది.
ఆ వ్యక్తిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు - Terasa Complaint on National BC Commission Member Acharya Trs
జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిపై ఎస్ఈసీకి తెరాస ఫిర్యాదు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి... ప్రచారంలో పాల్గొంటున్నారని పేర్కొంది.
తెరాస ఆ వ్యక్తిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
భాజపా కండువా కప్పుకొని ఆచారి ప్రచారం చేస్తున్నారన్న తెరాస నేతలు ఆయనపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అటు హైకోర్టు ఉత్తర్వులు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ సభ నిర్వహించిన భాజపా ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని తెరాస కోరింది.