వేతన సవరణ విషయంలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేర్వేరుగా పరిగణిస్తూ ప్రభుత్వం విభజించు-పాలించు అనే సూత్రాన్ని అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఎంఎల్‌సీ ఎన్నికల్లో వరుసగా తెరాస అభ్యర్థులు ఓటమి పాలవుతుండటంతో.. ప్రభుత్వం, ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు.
పని ఒత్తిడి ఉండదనే సాకుతో ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదనే విధంగా అధికార వర్గాల నుంచి సంకేతాలు రావడం అర్థరహితమన్నారు చాడ. వేతన సవరణ అనేది పని దినాలపై కాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.