తెలంగాణ

telangana

ETV Bharat / state

మజ్లిస్ చేతిలో తెరాస కీలుబొమ్మ :కిషన్​ రెడ్డి - గ్రేటర్ ఎన్నికలు 2020

అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి తాకట్టు పెట్టడానికి కాదని కేంద్ర సహాయమంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్​ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా రోడ్​ షో నిర్వహించారు.

TRS government puppet in the hands of the Majlis says central minster kishanreddy
మజ్లిస్ చేతిలో తెరాస కీలుబొమ్మ :కిషన్​ రెడ్డి

By

Published : Nov 28, 2020, 7:59 PM IST

గత ఎన్నికల హామీలు నేరవేర్చని కేసీఆర్​ను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి తాకట్టు పెట్టడానికి కాదని విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్​మెట్​, గాంధీనగర్​ డివిజన్లలో విస్తృతంగా రోడ్​ షో నిర్వహించారు.

మజ్లిస్​తో దోస్తీ చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్లను ఎంతమందికి ఇచ్చారో తెరాస నాయకులను నిలదీయాలని కిషన్​ రెడ్డి అన్నారు. జీహెచ్​ఎంసీలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో ప్రజలు ప్రశ్నించాలని కేంద్రమంత్రి తెలిపారు.

మజ్లిస్ చేతిలో తెరాస కీలుబొమ్మ :కిషన్​ రెడ్డి

బోజగుట్ట సభలో పాల్గొన్న కేంద్రమంత్రి:

గుడిమల్కాపూర్​లోని బోజగుట్టలో ఏర్పాటు చేసిన సభలో కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్​ భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్​ను గెలిపించాలని ఆయన కోరారు. భాజపా నాయకులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తెరాస మోసాలు అరికట్టేందుకు భాజపాను గెలిపించాలి: రఘునందన్​ రావు

ABOUT THE AUTHOR

...view details