తెరాస 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్ నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్లోని ఆయన నివాసం వద్ద... పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.
నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - హైదరాబాద్ తాజా వార్తలు
తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ నాగోల్లోని ఆయన నివాసం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఆధ్వర్యంలో తెరాస ఆవిర్భావ వేడుకలు
పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ రెడ్డి, నాగోల్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సతీశ్ యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి