తెరాస పార్టీ 20 ఏళ్ల చరిత్రను ప్రజలు మరువలేరని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించుకోవాలన్నారు.
కరోనా కట్టడికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి : ముఠా గోపాల్ - తెరాస ఆవిర్భావ దినోత్సవం ముషీరాాబాద్
కరోనా కట్టడికి తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తెరాస ఆవిర్భావ దినోత్సవం
తెరాస ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. వేడుకల్లో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేశ్, ముఠా నరేశ్, యువ నాయకులు ముఠా జై సింహతో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?