రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన హస్తం నేతలు పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీలు గల్లీలో మాట్లాడే అంశాలను దిల్లీలో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం తగదన్నారు. రాష్ట్ర విభజన అంశాలపై భాజపాను ప్రశ్నించే దమ్ము లేదని విమర్శించారు. ప్రజలు గెలిపించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
'ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి' - trs comments on congress mps speech
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. హస్తం నేతలు పార్లమెంటులో విభజన అంశాలను ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడాలని సూచించారు.
బూర నర్సయ్య గౌడ్