రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఎందుకు పెంచరని కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచేదీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు ఏడు అసెంబ్లీ స్థానాలను పెంచి అక్కడ ఓ న్యాయం చేస్తూ.. ఏపీ, తెలంగాణకు మరో న్యాయం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఒకే దేశం- ఒకే చట్టం అనే నినాదం ఏమైందన్నారు.
'కశ్మీర్‌కు ఓ న్యాయం... తెలుగు రాష్ట్రాలకు మరో న్యాయమా?' - కశ్మీర్ అసెంబ్లీ స్థానాల పెంపు
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
state planning commission vice president B Vinod Kumar latest news
ఆరేళ్లుగా అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భాజపాకి తెలుగు రాష్ట్రాల్లో లాభం లేనందున అసెంబ్లీ సీట్ల పెంపుపై దాట వేస్తోందని అన్నారు. శాసనసభ సీట్ల పెంపు విషయంలో ప్రజలు న్యాయస్థానంలో సవాల్ చేస్తారన్నారు.
ఇదీ చూడండి:'న్యాయ విచారణ కమిషన్ ఉన్నందున ఇప్పుడేం విచారించలేం'