జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెంగళరావునగర్ తెరాస కార్పొరేటర్ కిలారి మనోహర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
భాజపాలో చేరిన తెరాస కార్పొరేటర్ - హైదరాబాద్ తాజా సమాచారం
గ్రేటర్ ఎన్నికల్లో నేతలు కండువాలను మార్చుతున్నారు. వెంగళరావు నగర్ తెరాస కార్పొరేటర్ కిలారి మనోహర్ భాజపాలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

భాజపాలో చేరిన తెరాస కార్పొరేటర్
భాజపా వెంగళరావు నగర్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది. టికెట్ హామీతో పాటు భవిష్యత్తులోనూ తగిన గుర్తింపు ఇస్తామనడంతో కమల దళంలో చేరినట్లు ఆయన తెలిపారు.