ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు - తీన్మార్ మల్లన్న వార్తలు
07:02 March 18
ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం ఓట్ల లెక్కింపు మూడో రౌండ్ ముగిసేసారికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 11687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 47,545 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 35,858 ఓట్లు వచ్చాయి. కోదండరాంకు 29,560 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 18,604 ఓట్లు, రాములు నాయక్‌కు 11,931 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో రెండో రౌండ్ ఫలితాలు వచ్చాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి 2613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌడ్లో వాణీదేవికి 35,171, రాంచందర్ రావుకు 32,558, చిన్నారెడ్డికి 10,062, నాగేశ్వర్ 16,951 ఎల్.రమణకు 1,811 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి:ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు