వెంగళ్రావు నగర్ డివిజన్ రూపురేఖలు మార్చి మోడల్ డివిజన్‌గా మార్చడమే తన ధ్యేయమని ఆ డివిజన్ తెరాస అభ్యర్థి దేదీప్య రావు పేర్కొన్నారు. బల్దియా ఎన్నికల్లో తన మీద నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టికెట్ ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్‌గా తనని గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వెంగళ్రావు నగర్‌ని మోడల్ డివిజన్‌గా మారుస్తా: దేదీప్య రావు - వెంగల్రావు నగర్ డివిజన్లో తెరాస ప్రచారం
బల్దియా ఎన్నికల్లో తెరాస విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్రావు నగర్ డివిజన్లో అభ్యర్థి దేదీప్య రావు ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు.
వెంగళ్రావు నగర్‌ని మోడల్ డివిజన్‌గా మారుస్తా: దేదీప్య రావు
ప్రభుత్వంలో సీఎం కేసీఆర్.. పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి తెరాసని గెలిపించాలని అభ్యర్థి కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.