జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మల్లేపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి మెట్టు వాణి.. డివిజన్లోని సీతారాంబాగ్‌లో ఇంటింటి పర్యటన చేశారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే బస్తీలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి బస్తీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
ఒక్క అవకాశం ఇస్తే మల్లేపల్లి డివిజన్‌ని అభివృద్ధి చేస్తా: మెట్టు వాణి - mallepally trs candidate mettu vani
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లేపల్లి డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి మెట్టు వాణి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లను కోరారు.
'ఒక్క అవకాశం ఇస్తే మల్లేపల్లి డివిజన్‌ని అభివృద్ధి చేస్తా'
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుపుతూ మెట్టు వాణి.. ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గడపగడపకు బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు.
ఇదీ చదవండి:'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'