గ్రేటర్ ఎన్నికల్లో బోరబండ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యావాదాలు తెలియజేశారు.
బోరబండను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా: బాబా ఫసియుద్దీన్ - బోరబండ తెరాస అభ్యర్థి విజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోరబండ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
బోరబండను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా: బాబా ఫసియుద్దీన్
గతంలో డివిజన్లో వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బోరబండను మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.