తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపై తెరాస ఆగ్రహం

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్​ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపై మంత్రి జగదీశ్​ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు.. మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని జగదీశ్​ రెడ్డి డిమాండ్ చేశారు.

Trs angry over delay in election counting process
Trs angry over delay in election counting process

By

Published : Nov 6, 2022, 11:46 AM IST

Updated : Nov 6, 2022, 12:06 PM IST

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన తెరాస అసహనం వ్యక్తం చేసింది. రౌండ్​ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపై మంత్రి జగదీశ్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారుల నుంచి లీకులు అందుతున్నాయన్న వార్తలపైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని జగదీశ్​ రెడ్డి డిమాండ్ చేశారు.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడి జాప్యంపై భాజపా నేతలు కూడా స్పందించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే.. 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

Last Updated : Nov 6, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details