తెరాస, భాజపా నాయకుల హోరాహోరీ నిరసనలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ చౌరస్తా రణరంగాన్ని తలపించింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
గొడవకు కారణమదే
యూసుఫ్‌గూడ చౌరస్తాలో మొదట భాజపా మహిళా నేత, సినీ నటి కరాటే కల్యాణి, మరికొందరు భాజపా కార్యకర్తలుతో కలిసి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా పెద్దఎత్తున రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు.
తెరాస, భాజపా పోటాపోటీ నిరసనలు ఇదీ చూడండి: