మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తెరాస నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ వలవేస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. ఓటుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈనెల 20న 23వ వార్డులో అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తుండగా భాజపా నాయకులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేత శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని భాజపానేత తెలిపారు.
మీర్పేట్లో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ - TRS and BJP leaders clash
మీర్పేట్లో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. తెరాస నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని భాజపా ఆరోపించింది. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు.
![మీర్పేట్లో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ Trs_Bjp_Godava](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5788515-517-5788515-1579609719033.jpg)
Trs_Bjp_Godava