Conflict Between TRS AND BJP video : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయిన్‌పల్లిలో శిలాఫలకం విషయంలో తెరాస-భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తమ హయాంలో నిధులు మంజూరైతే భాజపా నాయకులు రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా చేస్తారంటూ తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శిలాఫలకాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో తెరాస-భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు.
Conflict Between TRS AND BJP video : రహదారి ప్రారంభ విషయంలో తెరాస, భాజపా శ్రేణుల గొడవ - తెలంగాణ వార్తలు
Conflict Between TRS AND BJP video : బోయిన్‌పల్లిలో రహదారి ప్రారంభోత్సవంలో ఘర్షణ నెలకొంది. రహదారి ప్రారంభ విషయంలో తెరాస, భాజపా శ్రేణులు గొడవకు దిగాయి. శిలాఫలకం పెట్టొద్దంటూ తెరాస నాయకుల ఆందోళన చేపట్టారు. ప్రొటోకాల్ పాటించట్లేదని నిరసన వ్యక్తం చేశారు.
రహదారి ప్రారంభ విషయంలో తెరాస, భాజపా శ్రేణుల గొడవ
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయని ఇవ్వబోమని తెరాస నాయకులు స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డి లేకుండా ఏ విధంగా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'నేనేంటో హైదరాబాద్ పోలీసులకు చూపిస్తా'.. యువతి హల్చల్