TCongress: తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి నేతృత్వంలో వంద మందికిపైగా అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హస్తం పార్టీలో చేరిన వారిలో.. ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటేశ్వర డివిజన్ల నుంచి డివిజన్ కమిటీలు, బస్తీ కమిటీలకు చెందిన వారున్నట్లు తెలిపారు. వారందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చినట్లు విజయారెడ్డి చెప్పారు.