Attack on mp aravind house: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి
Attack on mp aravind house: కవితపై భాజపా ఎంపీ అర్వింద్ వాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లో తెరాస కారకర్తలు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. లోపలికి చొచ్చుకెళ్లి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కార్యకర్తలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
Attack on mp aravind house
ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 18, 2022, 1:52 PM IST