ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ - telangana news

18:13 May 14
ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్లో విభజన అంశాలకు సంబంధించి వివాద పరిష్కార ఉపసంఘం ఈ నెల 25న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానుంది. కమిటీలో సభ్యులుగా ఉన్న తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సమావేశంలో పాల్గొంటారు. ఉపసంఘం గతంలో ఒకమారు సమావేశం కాగా... తాజాగా రెండో భేటీ జరగనుంది.
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, సమస్యలపై సమావేశంలో సమీక్షిస్తారు. సమావేశ ఎజెండాలో నాలుగు అంశాలను చేర్చారు. దిల్లీలోని ఏపీభవన్ విభజన, విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్ లోని సంస్థల విభజనపై చర్చ జరగనుంది. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజనపై చర్చిస్తారు. విభజనచట్టంలో పేర్కొనని ఇతర సంస్థల విభజనకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.
ఇవీ చదవండి: