ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు (Tributes to Chief Minister KCR on the occasion of Birsa Munda Jayanti) అర్పించారు. స్వరాజ్యం కోసం.. ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం... వారి హక్కుల కోసం.. పోరాడుతూ.. అతిచిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన బిర్సాముండా చిరస్థాయిగా నిలిచారన్నారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ.. వారి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ (cm kcr talk about birsa munda jayanti) పేర్కొన్నారు.
ఎవరీ బిర్సా ముండా?
గిరిజనుల్లో సామాజిక సంస్కరణలు తీసుకురావడానికీ బిర్సా ముండా కృషి చేశారు. మద్యపానాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఉద్యమించారు. దైవంపై విశ్వాసం ఉంచి, సత్ప్రవర్తనను అలవరచుకోవాలని బోధించారు. గిరిజనులు తమ మూలాలను తెలుసుకొని, ఐక్యంగా మెలగాలని పిలుపిచ్చారు. వనపుత్రుల్లో చైతన్యం తెచ్చి, వారిని ఏకతాటిపై నడిపారు. అందువల్లే బిర్సా ముండాను ‘భగవాన్’ అని సంబోధించేవారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల్లో బిర్సా ముండాకు విశిష్ట స్థానం ఉంది. కేవలం 25 ఏళ్ల వయసులో ఆయన చేసిన త్యాగాలు, సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఆయన జరిపిన పోరాటాల వల్లనే బ్రిటిష్ వలస పాలకులు గిరిజనుల భూ హక్కులను గుర్తిస్తూ చట్టాలు చేశారు. పిన్న వయసులోనే అమరులైనా- ఆయన తెచ్చిన సాంఘిక, సాంస్కృతిక విప్లవం గిరిజనుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. బ్రిటిష్ వారిపై గిరిజనులు జరిపిన సాయుధ పోరాటం వారి దేశభక్తికి తిరుగులేని నిదర్శనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మనం జరుపుకొంటున్న ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో మాతృదేశం కోసం గిరిజన వీరులు చేసిన త్యాగాలను స్మరించుకొంటున్నాం.