తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ.. ఎందుకంటే..! - Adivasis plea to Minister Appalaraju

Minister Appalaraju: ఏపీలో మంత్రి అప్పలరాజుకు.. ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో బోయ, వాల్మీకి, నకిలీ బొంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చవద్దని.. ఆదివాసీలు పలాసలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అందుకు సంబంధిం జీవో 52 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం తీసుకున్న మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి అప్పలరాజు
మంత్రి అప్పలరాజు

By

Published : Nov 25, 2022, 7:10 PM IST

Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. బోయ, వాల్మీకి, నకిలీ బొంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చవద్దని ఆదివాసీలు పలాసలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అందుకు సంబంధిం జీవో 52 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆదివాసీలు నుంచి వినతి పత్రం తీసుకునేందుకు మంత్రి అప్పలరాజు రాగా.. ఆదివాసీలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతి పత్రం తీసుకుని ముగ్గురు, నలుగురితోనే మంత్రి మాట్లాడుతుండగా.. మైక్‌లో మాట్లాడాలని ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. ఆదివాసీల నిరసనతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. ఇక్కడ రాజకీయాలు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

మంత్రి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ.. ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details